![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -344 లో.. అనామిక కోపంగా ఇంటికి వచ్చి.. ఇంట్లో అందరిని హాల్లోకి రమ్మని చెప్తుంది. ఎందుకు ఇంత కోపంగా ఉన్నావ్ ఏమైందని అనామికని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుడే రాజ్, కావ్య, కళ్యాణ్ కూడా వస్తారు. మీ అబ్బాయే కారణమని అనామిక అనగానే అందరు షాక్ అవుతారు. నేను ఆఫీస్ కి పంపించింది వర్క్ చేస్తూ డెవలప్ అవుతాడని కానీ మీ కొడుకు వెళ్లి అందరిని పోగు చేసి కవి సమ్మేళనం చేస్తున్నాడని అనామిక అంటుంది.
ఆ తర్వాత ఈ విషయం గురించి ఇక్కడే మాట్లాడావా ఆఫీస్ లో కూడా మాట్లాడావా అని అనామికని సుభాష్ అడుగుతాడు. ఆఫీస్ లో కూడా అందరి ముందు వాడి పరువు తీసే వచ్చిందని ప్రకాష్ అంటాడు. ఎందుకు అందరి ముందు తిట్టి వాడి పరువు తీసావ్? వాడికి ఎలా ఉంటుందని ధాన్యాలక్ష్మి అనగానే.. అందరు ఒకటి అయ్యారా.. నా భర్త ఒక అసమర్థతుడు లాగా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది.. అందుకే గొడవ పెట్టుకొని మరి ఆఫీస్ కి పంపించానని అనామిక అంటుంది. వాడిని అందరి ముందు అక్కడ తిట్టిందే కాకుండా ఇంటికి వచ్చి కూడా తిడతావా.. నువ్వే కాదు ఎవరికి వాడిని తిట్టే రైట్ లేదని రాజ్ అంటాడు. అయిన అసలు కళ్యాణ్ చేసిన తప్పేంటి? నీకు ముందే కవితలు రాస్తాడని తెలిసే ఇష్టపడ్డావ్ కదా అని కావ్య అనగానే.. నువ్వు ఆపు నీవల్లే ఇదంతా.. నా భర్తని అసమర్థుడిని చేసి నీ భర్తని సమర్థుడుని చేసావని అనామిక అనగానే.. ఇక ఆపు అనామిక అంటు కళ్యాణ్ కోప్పడతాడు.. ఇప్పటివరకు నీపై ఉన్న ఇష్టంతో అన్నీ ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. నన్ను కవితలు చూసే ఇష్టపడ్డావ్ కదా.. ఇప్పుడు ఎందుకు ఇలా.. ఒకటి చెప్తున్నా.. ఇకపై నీకు నచ్చినట్టు కాదు.. నాకు నచ్చినట్టు మాత్రమే ఉంటానని కళ్యాణ్ అంటాడు.
ఆ తర్వాత ఎన్ని రోజలు పిచ్చి రాతలు రాసుకుంటూ ఉంటావని అనామిక అనగానే.. నువ్వు ఆపు ఇక.. నా మనవడిని చూసి ప్రేమించావా.. ఆస్తులు చూసి ప్రేమించావా.. ఆస్తి అయితే బోలెడుంది.. వాడికి నచ్చినట్టుంటాడని ఇందిరాదేవి అంటుంది.. నేను చెప్పేది కూడా విను. నేను నీకోసం బ్రతకను నా కోసం మాత్రమే బ్రతుకుతానని కళ్యాణ్ అనగానే.. అనామిక కోపంగా వెళ్లి కళ్యాణ్ రాసిన కవితల పేపర్స్ కిందకి కళ్యాణ్ పై విసిరేస్తుంది. అవి చూసిన కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ గదిలోకి వెళ్లి ఆ పేపర్స్ అన్నీ బీరువాలో పెట్టి ఒక లెటర్ తీసుకొని వచ్చి అనామిక దగ్గరికి వచ్చి.. నీకోసం వాలైంటైన్స్ డే అని రాసాను కానీ ఇది తీసుకునే అర్హత నీకు లేదని కళ్యాణ్ బయటకు పారేస్తాడు. అది కావ్య తీసుకొని అనామిక దగ్గరికి వెళ్లి కళ్యాణ్ ప్రేమగా రాసాడు. అది ఒకసారి చదువని అనామికకి కావ్య ఇస్తుంది. తరువాయి భాగంలో నేను పుట్టింటకి వెళ్తానని రాజ్ తో కావ్య చెప్తుంది. సరే అని రాజ్ అనగానే.. వెళ్ళి నువ్వు బట్టలు సర్దుకో.. నేను సర్దుకుంటా అన్న అని తన బావ భాస్కర్ కావ్యతో అంటాడు. అది విని వీడు కూడా వెళ్తున్నాడా.. అయితే వీళ్ళ వెంట నేను కూడా వెళ్ళాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |